బుల్లెట్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి హరీష్ రావు

SMTV Desk 2018-01-20 11:25:13  minister harish rao, reservoir audit, siddipet.

సిద్ధిపేట, జనవరి 20 : భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుల్లెట్‌పై తిరుగుతూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. సుమారు ఆరు గంటల పాటు సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి ఎడవ కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడి సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామాల్లో పర్యటించారు. నేరుగా రైతులతో మాట్లాడుతూ.. సాగర్‌కు గోదావరి జలాలు వస్తున్నాయి. పంటలు బాగానే పండుతాయ౦టూ భరోసానిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. తెలంగాణ.. ప్రాజెక్టుల నిర్మాణంలో ఒక చరిత్రను సృష్టిస్తుందని, కరువు పీడిత ప్రాంతాల రైతుల కళ్లల్లో ఆన౦దాన్ని నింపుతామని తెలిపారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.