రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన బ్యాడ్మింటన్..

SMTV Desk 2018-01-12 17:25:04  PV Sindhu, Bhasawatnam Indo Cancer Hospital, balakrishna

హైదరాబాద్, జనవరి 12: భారత ప్రముఖ షట్లర్, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు మానవత దృక్పథాన్ని చాటుకుంది. బసవతారకం ఇండో క్యాన్సర్‌ ఆస్పత్రికి రూ.25 లక్షల విరాళంగా అందజేశారు. అనంతరం సింధు మాట్లాడుతూ... క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడుతున్న నిరుపేద బాధితులను ఆదుకొనేందుకే ఈ మొత్తాన్ని ఆసుపత్రికి అందజేస్తున్నట్టు తెలిపారు. విరాళంగా ఇచ్చిన డబ్బులు గతేడాది అక్టోబర్ మాసంలో కౌన్ బనేగా కరోడ్ పతి ( కెబిసి) షోలో గెలుచుకున్నవని అన్నారు. ఈ ఆసుపత్రి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, అందరి దీవెనలతో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని అంటూ నవ్వులు చిందించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ... చిన్న వయుస్సులో దాన గుణాన్ని అలవరుచుకున్న సింధును అభినందించారు. క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళమిచ్చిన సింధుకి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాడ్మింటన్ లో మరిన్నీ పథకాలు సాధించాలని ఆకాక్షించారు.