మరోవారంలో మేడారం జాతర : పనులు ముమ్మరంగా ఏర్పాట్లు

SMTV Desk 2018-01-08 15:17:58  medaram jathara, Arrangements for work

హైదరాబాద్, జనవరి 8 : మేడారం మహాజాతర కోసం దేవాలయానికి రంగులు దిద్దే కార్యక్రమం ప్రారంభించారు. మరుగుదొడ్ల నిర్మాణం పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. జాతర పండుగను పూర్తి చేసేందుకు మరో వారం రోజులే గడువు ఉండటంతో, అప్పటిలోపు పనులు పూర్తి అవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతవారం నుంచే మేడారంకు భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతుంది. కానీ కొన్ని శాఖలకు సంబంధించి పనులు ఆశించిన మేర వేగంగా పనులు జరగడం లేదు. ఇంకా 20 రోజులు ఉందన్న భావనలో అధికారులు నిదానంగా పనులు కానిస్తున్నారు. ఈ జాతరలో భాగంగా విద్యుత్ శాఖకు రూ. 4 కోట్లు కేటాయించగా, ఈ పనులు దాదాపు ఓ కొలికి వచ్చాయి. ప్రస్తుతం దేవాలయ పరిసరాల్లో విద్యుత్ దీపా అలంకారణ జరుగుతుంది. అలాగే, ఎక్కడికాక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు పై పోలీసుశాఖ దృష్టి సారించింది. జాతర పనులపై సమీక్షలు హైదరాబాద్ కు పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో వేగం మందగించింది. మరో వారమే గడువు ఉండటంతో ఇప్పటికైనా పనులు శరవేగంగా కొనసాగించాలని అధికారులు కొన్ని శాఖలకు వెల్లడించారు.