విద్యుత్ కోతను అరికట్టిన సీఎం కేసీఆర్ :కవిత

SMTV Desk 2018-01-07 18:01:25  telangana cm kcr, mp kavitha, farmers current problem solve

హైదరాబాద్, జనవరి 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతుల ప్రధాన సమస్యను తీర్చారని, ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నేడు కవిత సమక్షంలో తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘంలో పలువురు విద్యుత్ ఉద్యోగాల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రైతులకు ప్రధాన సమస్యగా మారిన విద్యుతు కోతను సీఎం కేసీఆర్‌ పూర్తిగా నిర్మూలించి చూపించారని ఆమె తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చి, 20 వేలకు పైగా విద్యుత్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారని ఆమె కొనియాడారు. అంతేకుండా, జెన్‌కో కార్మికులకు హెల్త్ క్రెడిట్ కార్డులు, జెనరేటింగ్ స్టేషన్‌ కార్మికుల నివాస గృహాలకు కూడా త్వరలో కృషి చేస్తామని కవిత వెల్లడించారు.