ఇసుక మాఫియాను అరికట్టాలి :కోదండరాం

SMTV Desk 2018-01-07 17:27:31   Sand mafia, TJAC Chairman is Kodandaram Comments, sirisilla

సిరిసిల్ల, జనవరి 7 : తెలంగాణలో ఇసుక మాఫియాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని టీజేఏసీ ఛైర్మన్ కొదండరాం ధ్వజమెత్తారు. ఈ మేరకు వామపక్షాలు ప్రజా సంఘాలతో కలిసి సిద్ధిపేట నుంచి నేరెళ్ల వరకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలోని మంత్రులు, అధికారులు ఈ ఇసుక కాంట్రాక్టులను వారి స్థానికులకే లభించయంపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ కాంట్రాక్టు తీసుకున్నవాళ్లు కూడా లెక్కకుమించి లారీలను నడిపిస్తున్నారని, నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ, మితిమీరిన వేగంతో లారీలను నడుపుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనిపై ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కోదండరాం విమర్శించారు. ఈ మేరకు నేరళ్ల బాధితులకు న్యాయం జరగాలని, ఇసుక అక్రమ రవాణాని అరికట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. అలాగే, నేరళ్ల ఘటన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.