వ్యవసాయానికి ఈ ఏడాది ప్రత్యేక బడ్జెట్‌..!

SMTV Desk 2018-01-06 14:21:43  kcr pragathibhavan meeting, agriculture issue, minister pochaaram srinivas.

హైదరాబాద్, జనవరి 6 : రైతుల విషయంలో నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పెట్టుబడి మద్దతు పథకం అమలుపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన ఆయన ఉపసంఘాన్ని ప్రకటించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉపసంఘం పని చేయనుంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. "వ్యవసాయానికి ఈ ఏడాది నుండి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెడతా౦. పెట్టుబడి సాయం, పంటల మద్దతు నిధులను ఈ బడ్జెట్లో చూపిస్తా౦. రాష్ట్రంలో రైతులకు నిధుల కొరత లేదు. ప్రతి పంటకూ మద్దతు ధర ప్రకటించేలా కేంద్ర విధానం ఉండాలి. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడతా, అవసరమైతే పార్లమెంటులో కూడా చర్చిస్తా" అని వెల్లడించారు. త్వరలోనే రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.