కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ సిద్ధం...

SMTV Desk 2018-01-05 12:38:03  Kaleshwaram Project, first pump ready to dry run

హైదరాబాద్, జనవరి 5 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొదటి పంప్ డ్రైరన్ కు రంగం సిద్దమవుతుంది. పెద్దపల్లి జిల్లా రామడుగు వద్ద ఎనిమిదో ప్యాకేజీలోని భూగర్భ పంప్ హౌస్ లో మొదటి పంప్ బిగింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ పంప్ ద్వారా 115 మీటర్ల ఎత్తుకు 3147 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. రామడుగు ఫాంహౌస్ లో ఇటువంటి ఏడు పంపులను ఏర్పటు చేసి, 22 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. దేశంలోనే ఈ అతిపెద్ద పంప్ తో పాటు పంప్ హౌస్ ఎక్కడలేదు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 82 పంపు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకుజలాలు తరలించే మార్గంలో ఈ భూగర్భంలో ఈ పంప్ హౌస్ నిర్మించారు. ఇప్పటికే మొదటి పంపు ప్రక్రియ పూర్తిచేయడంతో పాటు అనాధికరంగా పరీక్షించి చూశారు. ఉత్పన్నమైన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుని వారం పది రోజుల్లో అధికారికంగా డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి నాటికి రెండు, జూన్ నాటికి అన్ని పంపులు సిద్ధమవుతాయని, అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.