నగరంలో 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాట్లు :డీజీపీ మహేందర్‌రెడ్డి

SMTV Desk 2018-01-04 16:07:27  10 lakh cc cameras arrangements in hyderabad, DCP Mahendhar reddy

హైదరాబాద్, జనవరి 4 : హైదరాబాద్ లో నేరాల నియంత్రనే లక్ష్యంగా పోలీసులు అధికారులు మరో ముందడుగు వేశారు. గ్రేటర్‌ పరిధిలో పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని పోలిస్ కమిషనరేట్ లో ఈ నెల 3న టెక్నోలజి ఫ్యూసన్ సెంటర్ ను డీసీపీ మహేందర్ ప్రారంభించారు. నూతన సాంకేతికతతో ఫ్యూసన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించిన ఆయన దీని ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సీసీ కెమెరాల కమాండ్‌ కంట్రోల్, ట్రాఫిక్ కమాండ్‌ సెంటర్ సోషల్ మీడియా ల్యాబ్ ను అనుసంధానించవచ్చని తెలిపారు. అయితే, నగరంలో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను జిల్లాలకు కూడా విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా అత్యున్నత ప్రమాణాలతో ఫ్యూసన్‌ కేంద్రం ద్వారా నేర విశ్లేషణ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామనీ, ఇందులో భాగంగా సైబరాబాద్‌, రాచకొండ సహా అన్ని జిల్లాల్లోనూ ఈ కేంద్రాలను రూపొందిస్తున్నామన్నారు.