గజల్ శ్రీనివాస్ కు మరో ఎదురు దెబ్బ ..

SMTV Desk 2018-01-03 17:56:43  gajal srinivas, harresment case, save temples, brand ambassador,

హైదరాబాద్, జనవరి 3 : లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు గజల్ శ్రీనివాస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. సేవ్ టెంపుల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలిగిస్తు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓ అమ్మాయి గజల్ శ్రీనివాస్ తనను లైంగిక వేధిస్తున్నారని పోలీసులకు పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. ఈ విషయంపై సేవ్ టెంపుల్స్ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్ రావు మాట్లాడుతూ..” మహిళలు అంటే మాకు చాలా గౌరవం. అలాంటిది ఓ మహిళా పై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులు చర్య షాక్ కు గురి చేసింది. అటువంటి వ్యక్తికి మా సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగానివ్వం. అందుకే అతని పై వేటు వేశాము” అని వ్యాఖ్యానించారు. మరో వైపు శ్రీనివాస్ బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు తరపున న్యాయవాది వెల్లడించారు. సమాజంలో పేరు ప్రఖ్యాత గల వ్యక్తి కావున బెయిల్ వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.