లేడిస్ హాస్టల్ ముందు యువకుల వీరంగం..

SMTV Desk 2018-01-01 15:39:51  new year celebrations, boys miss behavior, in saroor nagar.

హైదరాబాద్, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పలువురు యువకులు డాన్సులు చేస్తూ.. లేడీస్‌ హాస్టల్‌ ముందు చాలా అసభ్యకరంగా ప్రవర్తించి, భీభత్సం సృష్టించారు. సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి వీవీ నగర్‌లో పలువురు యువకులు అతిగా మద్యం సేవించి లేడీస్‌ హాస్టల్‌కు వెళ్లి వారిని బయటకు రావాలంటూ అల్లరి చేశారు. అంతేకాకుండా హాస్టల్‌పై రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. అంతటితో ఆగకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా నిర్వాహకుడు భాస్కర్‌ వారిని అడ్డుకున్నాడు. దీంతో ఆ యువకులు అతనిపై దురుసుగా ప్రవర్తించి వారిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.