ప్రతిభకు ఫలితంగా ఇద్దరు బిక్షాటన చేసే యువకులకు ఉద్యోగాలు

SMTV Desk 2017-12-31 16:07:34   Beging beggars job, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 31 : ప్రస్తుతం ఉన్న సమాజంలో విద్యార్హతలు పొంది కూడా బిక్షాటన చేస్తున్న విద్యార్ధులు ఎందరో ఉన్నారు. తమ ప్రతిభను ఎవ్వరూ గుర్తించలేదన్న బాధతోనో, స్వయంకృతాపరాధాలతోనో బిచ్చగాళ్లుగా మిగిలిపోతున్న ఈ రోజుల్లో, ఓ ఇద్దరి బిచ్చగాళ్లను హైదరాబాద్‌ జైళ్లశాఖ అధికారులు గుర్తించారు. రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న ఉదయ్‌కుమార్‌, మురుగన్‌ అనే యువకులను జైళ్లశాఖ సిబ్బంది ఆనంద ఆశ్రమానికి తరలించారు. ఉదయ్‌కుమార్‌ బీకాం (కంప్యూటర్స్‌) గ్రాడ్యుయేట్‌ అనీ, మురుగన్‌కు మసాజ్‌ సెంటర్‌లో థెరపి్‌స్టగా పనిచేసిన అనుభవం ఉందని అక్కడే గుర్తించారు. విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా వారికి ఉపాధి కల్పించాలని జైళ్లశాఖ డీజీపీ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఉదయ్‌ కుమార్‌కు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా, మురుగన్‌కు ఆయుర్వేద హాస్పిటల్‌లో అసిస్టెంట్‌ థెరపిస్ట్‌గా ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం వారిద్దరూ నెలకు గౌరవంగా రూ.12వేలు సంపాదించుకుంటునట్లు అధికారులు వెల్లడించారు.