జగన్ ప్రజా సంకల్పయాత్ర @ 600 కి.మీ

SMTV Desk 2017-12-24 18:49:43  ys jagan, ysrcp, tdp, chandrababu.

అమరావతి, డిసెంబర్ 24: వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేడు 600 కిలో మీటర్ల మైలురాయి దాటారు. ఆయన ఈ యాత్ర నేటితో 43వ రోజుకు చేరుకుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. టిడిపి ప్రభుత్వం పాలనలో జరుగుతున్నా లోపాలను ఎండగడుతున్నారు. 2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని, వచ్చాక ప్రజా సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా ఈ రోజు అనంతపురం జిల్లా కటారుపల్లి గ్రామానికి చేరుకున్న జగన్ కు అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికి, 600 కిలో మీటర్లు పూర్తైనందుకు గుర్తుగా ఒక మొక్కను నాటి, పార్టి జెండాను ఎగురవేశారు.