డీసీపీ గంగారెడ్డిపై బదిలీ వేటు

SMTV Desk 2017-12-24 18:27:54  madapoor DCP Gangareddy, transfer, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 24 : లఘు చిత్రంలో నటించే ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, కొద్దీ రోజులుగా దర్శకుడు యోగి అసభ్య సందేశాలతో వేధించడంతో, జరిగినవిషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా, యోగిని విచారణలో భాగంగా పిలిపించిన డీసీపీ, నిందితుడ్ని కాలుతో తన్ని, కొడుతున్నట్లు వీడియోలో రికార్డైంది. అంతేకాకుండా, వీడియో కాస్త ప్రసార మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో డీజీపీ మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్యాను విచారణాధికారిగా నియమించారు. దీంతో శాండిల్య నివేదిక ఆధారంగా డీసీపీగా ఉన్న గంగారెడ్డిని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.