సినారె సంతాప సభ

SMTV Desk 2017-06-18 12:16:50  Dr. Singireddy Narayana Reddy, palamuru, Little Scholars High School,Commemorative assembly

మహబూబ్ నగర్, జూన్ 18 : ప్రముఖ సినీ రచయిత, మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డ్‌ గ్రహిత డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి అకాల మృతికి సంతాప సభ నిర్వహిస్తునట్లు కవులు తెలిపారు. ఈ సభను ఉమ్మడి పాలమూరు జిల్లాలో రచయితల వేదిక ధ్వని సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని లిటిల్‌ స్కాలర్స్‌ హై స్కూల్‌లో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు, కవులు జలజం సత్యనారాయణ, వెంకటేశ్వర్‌రెడ్డి, భీంపల్లి శ్రీకాంత్‌, లక్ష్మణ్‌గౌడ్‌, కోట్ల, గరిట గోపాల్‌, శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సంస్మరణ సభకు తెలంగాణ సాహిత్యఅకాడమి అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు జూలోరి గౌరిశంకర్‌ హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కవులు, కళాకారులు, సాహితివేత్తలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ఆ విశ్వంబరుడి ఆత్మకు శాంతి చేకుర్చుతారు.