ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభించిన సీఎం కేసీఆర్

SMTV Desk 2017-12-23 12:33:52  christamas celebrations, kcr, start, nijam college, telangana

హైదరాబాద్, డిసెంబర్ 23: నిజాంకళాశాల మైదానంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వేడుకలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేక్ కట్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశంలో 29 రాష్ర్టాలుంటే అధికారికంగా ప్రభుత్వం తరఫున కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వేడుకలు జరిపే రాష్ట్రం తెలంగాణ తప్ప మరోటి లేదు. మనం దేశానికి, ప్రపంచానికి కూడా సెక్యులరిజంలో ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాం. ఇలాంటి సంబరాలు వరుసగా నాల్గో ఏడాది చేస్తుండడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ చిన్నారులకు సీఎం కేసీఆర్ దుస్తులను పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన క్రిస్టియన్‌లకు, క్రిస్టియన్ సంస్థలకు ప్రభుత్వం తరఫున సీఎం అవార్డులను ప్రదానం చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రైస్తవ భవనం నిర్మాణం, చర్చిల మరమ్మతులకు రూ.10 కోట్ల మంజూరు, జెరూసలెం వెళ్లే క్రైస్తవులకు సబ్సిడీతో వసతి సహా సీఎం పలు వరాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ క్రిస్టియన్‌లకు ప్రాధాన్యం కల్పించి ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం పట్ల పలువురు క్రైస్తవ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.