ఈటల తనయుడు నితిన్ సంగీత్ లో గవర్నర్ దంపతులు

SMTV Desk 2017-06-17 19:17:42  Rajendra is the minister of finance, The marriage of the son, Medchal DistrGovernor Narasimhanict,Hitex in Hyderabad on 18th of this month

హైదరాబాద్, జూన్ 17 : తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ పెండ్లి జరగబోతున్న సందర్భంగా మేడ్చల్ జిల్లా పూడూరులోని వారి ఇంట్లో పెండ్లి వాతావరణం మొదలైంది. ఈ పెండ్లి సందడిలో భాగంగా శుక్రవారం నిర్వహించిన, సంగీత్, పెండ్లి కుమారుడిని చేయడం వంటి శుభకార్యాల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రులు కే తారక రామారావు, పట్నం మహేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొని నితిన్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు, మంత్రులకు ఈటల సాదరంగా ఆహ్వానం పలికారు. నితిన్ వివాహం ఈ నెల 18న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగనున్నది.ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భాస్కర్‌యాదవ్ తదితరులు పాల్గొని నితిన్ ఆశీర్వదించారు. .