వాయిదా పడిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశం

SMTV Desk 2017-12-21 11:02:02  inc post pone, osmania, 105 th meeting, hyderabad

హైదరాబాద్‌, డిసెంబర్ 21: హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో జరగాల్సిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ (ఐఎస్‌సీ)105 వ సమావేశం వాయిదా పడింది. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు ఈ సదస్సు జరగాల్సి ఉండగా, వాయిదా వేసినట్లు ప్రకటించిన ఇండియన్‌ సైన్స్‌ నిర్వాహకులు కారణం మాత్రం వెల్లడించలేదు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 27న సమావేశం కానున్నట్లు తెలిపారు. గత ఏడాది 104 ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌(ఐఎస్‌సీ) ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి వేదికగా జనవరి 3-7 వరకు జరిగింది.