సామాజిక మాధ్యమం కోరల్లో... సామాన్యురాలు...

SMTV Desk 2017-12-16 14:24:38  face book, face book cheat, harrasment, rape.

మహబూబాబాద్, డిసెంబర్ 16: పేస్ బుక్ లో ఒక యువకుడి పరిచయంతో ఓ బాలిక రోడ్డున పడిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొండ అరుణ్ అనే యువకుడు హైదరాబాద్ కు చెందిన శివానికి పేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు లేక నేను లేను.. అంటూ మాయమాటలు చెప్పి, శివానిని తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని మహబూబాబాద్ తీసుకెళ్ళాడు. వీరు ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో అరుణ్, శివానిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. అలా వారం రోజుల పాటు తన స్వగృహంలో శివానిపై తన వాంఛ తీర్చుకున్న అరుణ్, శివానిని హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. నన్ను పెళ్లి చేసుకోవా..? అని శివాని అడిగేసరికి... యాదగిరిగుట్ట దేవాలయానికి తీసుకెళ్ళి, మంగళసూత్రం కట్టి, ప్రస్తుతానికి నువ్వు మైనర్.. మేజర్ అయ్యాక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అని మాటిచ్చాడు. సరే అని, హైదరాబాద్ లోని బోడుప్పల్ లో వీరు దాంపత్య జీవితం మొదలుపెట్టారు. వీరికి నాలుగు నెలల క్రితం ఒక పడంటి ఆడపిల్ల జన్మించింది. ఈ విషయం తెలిసిన అరుణ్ తల్లిదండ్రులు మరో పెళ్లి చేస్తామని.. శివానిని వదిలిపెట్టమంటూ.. తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. వారి మాటలకు తల ఊపిన అరుణ్, శివాని తో పాటు 4 నెలల పాప ను కూడా వదిలి మహబూబాబాద్ వెళ్ళాడు. శివాని ఈ విషయంపై మహబూబాబాద్ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా కు శివాని ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణ్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయిన అరుణ్ ఒప్పుకోకపోవడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.