కేసీఆర్ పై ఉత్తమ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు...

SMTV Desk 2017-12-15 15:54:14  uttam kumar reddy, comments on kcr, LDMRC,

హైదరాబాద్, డిసెంబర్ 15 : ఎల్‌డీఎంఆర్‌సీ (లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ రిజర్వుడ్‌ కాన్‌స్టిట్యూయోన్సీస్‌) శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దళితులకు సీఎం పదవిస్తానని తానే ఆ పదవి స్వీకరించారని, ఉద్యోగాలను భర్తీ చేయలేదని, మద్దతు ధర అడిగినందుకు రైతులను జైలుకి పంపించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి ఆయనను రాష్ట్రం నుండి తరిమి కొడతామని ధ్వజమెత్తారు. ఇటీవల ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే కేసీఆర్‌ పరామర్శించలేదని వ్యాఖ్యానించారు.