ఫోర్జరీ చేశాడు.. ఎట్టకేలకు దొరికాడు...

SMTV Desk 2017-12-15 11:58:08  FORGERY SIGN, ANM JOB, COLLECTOR KARNAN, DMOH, MANCHIRYAL PS,

మంచిర్యాల, డిసెంబర్ 15 : ఉద్యోగం ఇప్పించడం కోసం ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ న్యూస్ ఛానెల్ విలేకరిగా పని చేస్తున్న సంతోష్ అనే వ్యక్తి తన మరదలికి ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పించాలనుకున్నాడు. దానికి కావలసిన అన్ని పత్రాల కోసం నకిలీవి సృష్టించారు. ఆ ధృవపత్రాలపై కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నెన్నెల ఆరోగ్య కేంద్రంలో సమర్పించాడు. కాని అధికారులు తిరస్కరించారు. దీంతో మంచిర్యాల డీఎం అండ్ హెచ్ ఓను కలిశాడు. ఈ నేపథ్యంలో ఆ పత్రాలను పరిశీలించిన ఆయన అనుమానం వచ్చి కలెక్టర్ కర్ణన్ కు చూపించి సంతకం మీదేనా అని అడిగారు. ఆ సంతకం తనది కాదు అని కలెక్టర్ చెప్పడంతో విషయం బట్టబయలైంది. ఈ మేరకు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.