ఐటీ ఉద్యోగుల చేత బలవంతపు రాజీనామాలు

SMTV Desk 2017-12-14 21:16:32  it company, resignation, hyderabad, hr team,

హైదరాబాద్‌, డిసెంబరు 14: తెలుగు చిత్ర సినిమాలో ఒక సన్నివేశంలో కొంత మంది వ్యక్తులు అక్రమ వ్యాపారాలు చేయడానికి హీరో దగ్గరకి వస్తారు. వాళ్ల ఆస్తులన్నీ ఒక సేవాసంస్థకు తెలియకుండా దానం చేసేస్తారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని ఎదురుతిరుగుతారు. ఇంకా వాళ్లను మీటింగ్ రూమ్ లోకి తీసుకువెళ్లి అక్కడ బౌన్సర్ లు చేత భయపెట్టించి చివరకు కథానాయకుడు తన పని పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఇదే కధను నగరంలో ఒక ఐటీ సంస్థ నిజం చేస్తుంది. కాకపోతే అక్కడ హీరో మంచి కోసం చేస్తాడు. కానీ ఇక్కడ కంపెనీ నియమాలను తుంగలో తొక్కి భయపెట్టి బలవంతపు రాజీనామా చేయిస్తుంది. ఒక గదిలో సంస్థ హెచ్‌ఆర్‌, సైకియాట్రిస్ట్‌, బౌన్సర్‌ ఉంటారు. కంపెనీలో ఎంపిక చేసిన ఉద్యోగులను ఒక్కొక్కరిని పిలిపిస్తున్నారు. రాజీనామా చేయాలని హెచ్‌ఆర్‌ చెపితే సైకియాట్రిస్ట్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. రాజీనామా చేసేది లేదని ఉద్యోగి ఎదురు తిరిగితే బౌన్సర్‌ రంగంలోకి దిగుతున్నాడు. ఉద్యోగి లేచి వెళ్లబోతే భుజాలు గట్టిగా అదిమి పట్టుకుని కూర్చబడుతున్నారు. రాజీనామా చేసే వరకూ అక్కడి నుంచి కదలనివ్వడం లేదు. నిజానికి, దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగుల నుంచి ఈ కంపెనీ రాజీనామాలు చేయిస్తోంది. అంతే కాకుండా చెన్నై, బెంగళూరు, ఉద్యోగులను ఇదే పద్దతిలో సాగనంపుతుందని సమాచారం. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఏకంగా కేబిన్లలో ఉన్న ఉద్యోగులను సెక్యూరిటీ సహాయంతో బయటకు పంపుతు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది. ఈ విషయం పై సంస్థ ఉద్యోగులను ఒక మీడియా సంస్థ వివరణ ఆడగగా చాలా ఆవేదనతో తమ బాధను వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది.