నగరంలో చెడ్డి గ్యాంగ్ హాల్ చల్

SMTV Desk 2017-12-12 17:21:06  cheddi gang, hyderabad, police

హైదరాబాద్, డిసెంబర్ 12 : హైదరాబాద్ లో కొద్ది రోజుల నుండి హాల్ చల్ చేస్తూ, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న చెడ్డి గ్యాంగ్, తాజాగా ఘట్ కేసర్ పరిధిలో చోరీలకు ప్రయత్నించింది. వరుసగా మూడు ఇళ్లల్లో దోపిడి చేసేందుకు చూశారు. చెడ్డి గ్యాంగ్ కదలికలు స్థానిక సీసీ కెమెరాల్లో చిక్కిన నేపధ్యంలో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. కిరాతకమైన దోపిడీ ముఠాగా పేరున్న వీరి కదలికలు తరచు కనిపిస్తున్న తరుణంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు విసృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 13 బృందాలుగా ఏర్పడిన పోలీసులు మియాపూర్ సహా వివిధ వీధుల్లో సోదాలు చేస్తున్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెపుతున్నారు.