రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు...

SMTV Desk 2017-12-12 15:27:28  traffic divert issue, saroor nagar, st meeting, rachakonda police officers.

హైదరాబాద్, డిసెంబర్ 12 : నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సరూర్‌ నగర్ మైదానంలో రేపు లంబాడాల శంఖారావ౦ బహిరంగసభ జరగనున్న నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులకు వివిధ స్థలాలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. వరంగల్, విజయవాడ నుంచి వచ్చే వాహనాలు నాగోలులోని మెట్రో స్టేషన్‌ సమీపంలో పార్కింగ్‌ చేయాలి. ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వాహనాలు బీఎన్‌రెడ్డి నగర్‌ సమీపంలోని ప్లెటెక్‌ ఏవియేషన్‌ మైదానంలో, ఎల్బీనగర్‌ నుంచి వచ్చే వాహనాలను డీసీపీ కార్యాలయం సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్‌ మైదానంలో అలాగే సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్‌లోని క్రికెట్‌ స్టేడియం సమీపంలో పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ డీసీపీ రమేష్‌ నాయుడు వెల్లడించారు.