భర్త మరో మొగాడితో రాసలీలలు సాగిస్తుండగా పట్టుకున్న భార్య...

SMTV Desk 2017-12-10 16:20:41  gay husband in kukatpally, ankush, deepika.

హైదరాబాద్, డిసెంబర్ 10: తన భర్త మరో మొగాడితో లైంగిక సంబంధం పెట్టుకొని, రాసలీలలు సాగిస్తుండగా భార్య పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జహీరాబాద్ కు చెందిన అంకుష్, దీపిక లకు 2014 లో వివాహం జరిగింది. నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్నపుస్తలబస్తీలో వీరు నివసిస్తుంటారు. పెళ్ళైనప్పటి నుండి మానసికంగా, శారీరకంగా తనను అంకుష్ వేధించేవాడని దీపిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తన విద్య సంస్థలో పని చేసే పలువురు యువకులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు, ఈ మేరకు కూకట్ పల్లిలో అద్దెకు తీసుకున్న రూములో యువకులను తీసుకెళ్ళి కోరిక తీరుకునేవాడని పోలీసులు తెలిపారు. అరుణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టరైన అంకుష్ ను ప్రశ్నించినప్పుడల్లా బయటకు తీసుకెళ్ళి అక్కడే వదిలిపెట్టేవాడని దీపిక వెల్లడించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అంకుష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తునట్లు తెలిపారు.