ఫలితాలు మెరుగుపడకుంటే తప్పు మీదే : ఉప ముఖ్యమంత్రి

SMTV Desk 2017-12-09 13:19:56  Deputy Chief Minister, Kadiam Srihari, about inter studys meeting,

హైదరాబాద్, డిసెంబర్ 09 : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. బాగ్‌ లింగం పల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో సమీక్షా నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. “జూనియర్‌ కళాశాలలు మూతపడే ప్రసక్తే లేదు. గత మూడేళ్లలో ఇంటర్‌ విద్యార్థుల సంఖ్య 1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు చేరుకోవడం శుభపరిణామ౦. ఫలితాలు మెరుగుపడకుంటే తప్పు మీలోనే ఉన్నట్లు భావించాల్సి వస్తుంది" అన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యను పటిష్ఠపరుస్తామని ప్రకటించిన కడియం.. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి జూనియర్‌ కళాశాలలకు వచ్చే విద్యార్థులకు ఉచిత బస్‌ పాసు ఇస్తామన్నారు. అలాగే అన్ని జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామన్నారు.