రెండేళ్లలో రాయదుర్గం వరకు మెట్రో: ఎన్వీఎస్‌రెడ్డి

SMTV Desk 2017-12-08 10:54:37  merto, md, rayadurgam, extention, nvs reddy

హైదరాబాద్, డిసెంబర్ 08: హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి బుధ, గురువారాల్లో ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, ట్రాఫిక్‌ పోలీసు అధికారులతో కలిసి అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గాన్ని పరిశీలించారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు పొడిగించిన కిలోమీటరున్నర మెట్రో మార్గాన్ని రెండేళ్లలో పూర్తిచేయాలని, ఈ పనులను వారం రోజుల్లో మొదలెట్టాలని ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణ సమయం, ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మొత్తం 49 స్తంభాలు వేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్‌ సులువుగా వెళ్లేలా చూస్తూ హైటెక్‌సిటీ ఫ్లైఓవర్‌ మీదుగా శిల్పారామం వైపు కాకుండా సీఎం సూచన మేరకు సైబర్‌ టవర్స్‌ పక్క నుంచి వయాడక్ట్‌ నిర్మించాలని, ఈ మేరకు రీ డిజైన్‌ చేయాలని ఎల్‌ అండ్‌ టీ మెట్రోకి సూచించారు. ఇప్పటికే అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు ఉన్న 8.5 కి.మీ. మార్గాన్ని జూన్‌కల్లా పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.