నేను జయలలిత కూతురినే.. నాకు ఈ మధ్యే తెలిసింది

SMTV Desk 2017-12-04 11:10:05  JAYALALITHA DAUGHTER, AMRUTHA, RELATIONSHIP.

చెన్నై, డిసెంబర్ 04 : తాను జయలలిత కుతురినేనని, ఈ నిజం నాకు ఈ మధ్యే తెలిసింద౦టూ బెంగళూరుకు చెందిన అమృత స్పష్టం చేశారు. తన పెంపుడు తండ్రి సారథి చనిపోయే సమయంలో తాను జయలలిత కుమార్తెనని చెప్పడంతో వెంటనే నిర్ధారించక బంధువర్గాలను ఆరా తీయడంతో ఈ నిజం తెలిసిందని అన్నారు. 1996 జూన్‌ 6న తొలిసారిగా జయలలితను చూశానని తెలిపారు. తనను చూడగానే జయలలిత ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకున్నారని అది చాలా దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్నామని అమ్మతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అమ్మను కలిసేందుకు సెక్రటేరియేట్ కు వెళ్లిన ప్రతిసారీ "నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు" అని అంటుండేవారు. ఆమె ఆస్పత్రిలో చేరడానికి ముందుగా తనను కలవడానికి వస్తున్నానని చెబితే, నేను ఇంట్లో ఉండబోవడం లేదు నువ్వు రావొద్దు అని వారించారని తెలిపారు. జయలలితను పలుమార్లు కలిసిన ఆధారాలు సీసీ టీవీ ఫుటేజీలో ఉంటాయని, అలాగే జెడ్ కేటగిరీ రిజిస్టర్ లో కూడా ఉంటాయని వెల్లడించారు.