చిన్నారుల దండనపై నిగ్గు తేలిన నిజాలు..

SMTV Desk 2017-12-03 15:55:31  teachers punishment on students, private schools, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 3: బాలలు గుడి తరువాత బడినే దేవాలయంగా భావిస్తారు. అలాంటి పాఠశాల, రోజురోజుకు దండనశాలగా మారిపోతుంది. ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులను విపరీతంగా దండిస్తున్నారు. క్రమశిక్షణ లేదనో, హోం వర్క్ చేయలేదనో, సరిగ్గా చదవడం లేదనో, ఫీజు కట్టలేదనో, ఈ విధంగా పలు కారణాలను ఆధారంగా చేసుకొని విధ్యార్ధులను చితకబాదుతున్నారు. విద్యార్థులపై హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే విద్యాశాఖ హడావుడి చేసి, ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తాం, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం, మెమోలు జారీ చేస్తామని వచ్చి ప్రకటనలు ఇచ్చి హడావుడి చేస్తున్నారు. ఆ తరువాత మళ్లి మాములుగానే ఉండడం గమనిస్తూనే ఉన్నాం. ఇటీవల యూనిసెఫ్‌ చేపట్టిన సర్వేలో ప్రతి ముగ్గురి విద్యార్ధుల్లో ఒకరు శిక్షి౦పబడుతున్నారని తేలింది. పాఠశాలల్లో బాలలపై జరుగుతున్నహింసను నిలువరించాలన్న ముఖ్య ఉద్దేశంతో జాతీయ బాలల హక్కుల కమిషన్‌ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పలు స్వచ్ఛంద సంస్థలు ఈ సంఘటనలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బయటపడ్డ వాస్తవాలు అందరినీ దిగ్బ్రాంతిని గురిచేశాయి. పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడని ఒకరిని, స్కూల్‌ యూనిఫామ్‌ వేసుకురాలేదని మరొకరని, తీవ్రంగా దండిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఉపాధ్యాయులు. ఈ విధంగా శిక్షించే వారికీ 2015 బాలల హక్కుల చట్టం ప్రకారం 18 ఏళ్ళలోపు పిల్లలని శారీరకంగా, మానసికంగా వేధించినా, దూషించినా మొదటిసారి రూ.10 వేలు జరిమాన, రెండో సారి దండిస్తే మూడు నెలల జైలు శిక్ష తో పాటు రూ.50 వేల వరకు జరిమాన విధించవచ్చు. ఇలాంటి విచారణకు సహ కరించాని యాజమాన్యాలపై రూ.లక్ష రూపాయలు జరిమాన, మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. వి ద్యాహక్కు చట్టం 2009 సెక్షన్‌-17 ప్రకారం విద్యార్థులను దండించిన ఉపాధ్యాయులను సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం శిక్షించవచ్చు.