16న ఎంసెట్ వెబ్ ఆప్షన్స్

SMTV Desk 2017-06-15 12:29:36  EAMCET Counseling, Engineering colleges, Web Options, This month 16

హైదరాబాద్, జూన్ 15 : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంజనీరింగ్‌ కళాశాలల వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఈ నెల 16నుంచి ప్రారంభం అవుతుందని ఎంసెట్ అడ్మిషన్ క్యాంపు అధికారి తెలిపారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం కొనసాగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు బుధవారం నాటికి 17,310 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏ కళాశాలలో ఎన్నిసీట్లు ఉన్నాయనే వివరాలను గురువారం మధ్యాహ్నం ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి వెల్లడించారు.