డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో యంగ్ కమెడియన్...

SMTV Desk 2017-12-03 15:28:44  DRUNK AND DRIVE, Young comedian Naveen Arrested.

హైదరాబాద్, డిసెంబర్ 03 : నగరంలో ఈరోజు ఉదయం పోలీసులు పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్‌ దాడులు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన యంగ్ కమెడియన్ (కుమారి 21ఎఫ్ ఫేమ్) నవీన్ కూడా ఉన్నారు. అతను బాగా తాగి వాహనం నడుపుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు. అనంతరం మీడియాను తప్పించుకోవడానికి పలు ప్రయత్నాలు చేశారు. అతనిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. వీరితో పాటు మందుకొట్టి కారు నడుపుతున్న పలువురు యువతులను కూడా పోలీసులకు పట్టుబడ్డారు.