అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ లో బాంబు బెదిరింపు..!

SMTV Desk 2017-12-03 10:38:51  ameerpet metro station, bomb threat in the Metro Station, Bomb Sword

హైదరాబాద్‌, డిసెంబర్ 03 : తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు తొలిరోజే రికార్డు సృష్టించింది. మెట్రో స్టేషన్‌ లు నిత్యం రద్దీతో కిటకిటలాడుతూ సందడిగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు ఉన్నట్లు ఓ ఆగంతకుడి నుంచి వచ్చిన ఫోన్ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించి౦ది. పోలీసులు బాంబు స్వార్డ్ బృందాలతో హుటాహుటిన అమీర్‌పేట్‌ చేరుకొని తనిఖీలు చేపట్టారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ బృందాలు అక్కడ ఎటువంటి బాంబూ లేదని తేల్చారు. అనంతరం ఆ ఫోన్ చేసిన వ్యక్తి తానంతట తానుగా వచ్చి పోలీసులకు అసలు విషయం తెలిపాడు. మెట్రో రైలు ఎక్కేందుకు వచ్చిన ఓ వ్యక్తి, తన హెల్మెట్ ను బ్యాగులో ఉంచి ఆ బ్యాగును రైల్వే స్టేషన్ లో పెట్టి వెళ్లిపోయాడు. ఇంతలో ఆ బ్యాగు చూసిన నాకు అనుమానం వచ్చి పట్టుకుని చూడబోయానని, ఏదో వస్తువు గట్టిగా తగలడంతో బాంబు ఉందన్న అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశానని వివరించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.