విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా.. అరెస్ట్...

SMTV Desk 2017-12-02 17:35:18  Smuggling of foreign cigarettes, seized, DRI officicers.

హైదరాబాద్, డిసెంబర్ 02 : విదేశాల నుండి అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. అరబ్‌, తదితర దేశాల నుంచి విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో పలు ప్రాంతాల్లో నిఘా ఉంచిన డీఆర్‌ఐ పోలీసులు, అనుమానాస్పదంగా కనిపించిన కంటైనర్‌ ను తనిఖీ చేశారు. ఆ కంటైనర్‌లో ఉన్న బాక్సులన్నింటిలో విదేశీ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కంటైనర్‌ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని అతని నుండి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా పట్టుబడిన విదేశీ సిగరెట్ల విలువ సుమారు రూ. 6.33 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.