ప్రజా గర్జనకు పిలుపునిచ్చిన : నేత రేవంత్ రెడ్డి

SMTV Desk 2017-12-02 16:08:23  Congress member revanth reddy, praja garjana, nagar kurnool, telangana government

హైదరాబాద్, డిసెంబర్ 02 : ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేత రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజా గర్జనకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్ర‌భుత్వంపై పోరాటానికై రేపు నాగ‌ర్‌క‌ర్నూల్‌లోని అచ్చం పేట నియోజ‌క వర్గంలో బ‌హిరంగ స‌భను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు తరలి వచ్చి కాంగ్రెస్‌తో చేయి కలపాలని ఆయన ప్రజలను కోరారు. కాగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపిస్తూ.. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.