మెట్రో స్మార్ట్ కార్డుతో జాగ్రత్త సుమా..!

SMTV Desk 2017-11-30 12:35:21  metro smart card, precautions, metro money paid area, money cut issue.

హైదరాబాద్, నవంబర్ 30 : మెట్రో స్మార్ట్ కార్డు చేతిలో ఉంది కదాని స్టేషన్ చుట్టూ కలియదిరుగుతూ మెట్రో అందాలను వీక్షిస్తున్నారా.! అయితే మీ సొమ్ము స్వాహా అయినట్టే.. అదెలా అంటారా..! మెట్రోలో ప్రయాణించాలని స్టేషన్‌లోకి ప్రవేశించాక పెయిడ్ ఏరియా నుంచి అరగంట లోపే ట్రైన్ ఎక్కాలి. లేదంటే మనకు తెలియకుండానే స్మార్ట్‌కార్డులోని సొమ్మంతా అయిపోతుంది. స్మార్ట్‌కార్డు కోసం రూ.200 చెల్లిస్తే అందులో రూ.100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే స్టేషన్‌లోకి ప్రవేశించాక రైలు ఎక్కకుండా అన్ని ప్రాంతాలు అలా చూసొద్దామని ఓ గంటసేపు అక్కడే తిరిగితే స్మార్ట్‌కార్డులోని డబ్బు కట్ అవుతూ ఉంటుంది. స్టేషన్‌లో ఉన్నంత సేపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకని కాస్త జాగ్రత్త వహించండి.