సెక్స్ రాకెట్ లో తెలుగు టీవీ నటి!

SMTV Desk 2017-11-30 12:07:56  prosecution, Telugu tv artist, arrest, uppal police

హైదరాబాద్, నవంబర్ 30: సినీ నటులు లగ్జరీ జీవితాలకు అలవాటుపడి అవకాశాలు లేని సమయంలో వ్యభిచారాన్ని ఆశ్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డ సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇటువంటి మరో ఘటన నగరంలో వెలుగు చూసింది. ఆన్‌ లైన్‌ మాధ్యమంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ తెలుగు టీవీ నటి అరెస్ట్ అయ్యింది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణానగర్‌ కు చెందిన సోయల్‌, రెడ్డి నరేష్ నాయుడు అనే ఇద్దరూ ఆన్ లైన్ లో ప్రకటనలు ఇచ్చి విటులను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి, బుల్లితెర నటి చిత్రాన్ని చూసి ఆమెను బుక్ చేసుకోగా, ఆమెను ఉప్పల్‌ ప్రశాంత్‌ నగర్‌ కు పంపించారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ విభాగం పోలీసులు, ప్రశాంత్‌ నగర్‌ రోడ్డులో బుక్ చేసుకున్న విటుడి కోసం వేచిచూస్తుండగా, నటితో పాటు రెడ్డి నరేష్ నాయుడిని అరెస్ట్ చేశారు. ఆపై వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశామని వారు తెలిపారు.