సీఎం దత్తపుత్రిక ఇప్పుడు నర్సింగ్..

SMTV Desk 2017-06-14 10:43:49  cm kcr, Pratyusha is currently doing nursing course, Dattaputrika

హైదరాబాద్, జూన్ 14 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ చొరవతో సవతితల్లి చేతిలో చిత్రహింసల నుండి బయటపడ్డ ప్రత్యూష ప్రస్తుతం నర్సింగ్‌ కోర్సు చేస్తోంది. ఆమె నర్సింగ్‌ కోర్సు చేస్తోందన్న సమాచారాన్ని అధికారులు మంగళవారం సీఎంకు వివరించగా ఆయన ఆనందం వ్యక్తపరిచారు. గత ఏడాది ఆగస్టులో సవతి తల్లి తీవ్ర హింసలకు గురై, గాయపడి ఆసుపత్రి పాలైన ప్రత్యూషను సీఎం కేసీఆర్‌ ఆదుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెను పరామర్శించడానికి వచ్చిన సీఎం దంపతులు ఆమెను వారి దత్తపుత్రికగా ప్రకటించారు. ఇంటికి పిలిపించి భోజనం పెట్టడంతోపాటు ఆమెకు కోరుకున్న సాయం అందిస్తామని వెల్లడించారు. సీఎం హామీ మేరకు ప్రభుత్వం తరఫున ఆమెకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు ఈ ఏ లోటు రాకుండా, ప్రతూష్య కోరుకున్న విధంగా చదివిస్తున్నారు.