అందుకే బిత్తిరి సత్తిపై దాడి చేశాడట..

SMTV Desk 2017-11-27 19:02:56  v6 bittiri satti, Attack on the bolt with a helmet, banjarahills police, interrogate manikanta.

హైదరాబాద్, నవంబర్ 27 : v6 బిత్తిరి సత్తిపై హెల్మెట్ తో దాడి చేసిన దుండగుడిని పోలీసులు గుర్తించారు. అయితే ఆ వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి పేరు మణికంఠగా గుర్తించిన పోలీసులు ఆయన నుండి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాడు. బిత్తిరి స‌త్తిని కొట్ట‌డానికే అక్క‌డ‌కు వ‌చ్చాన‌ని, వీ6 తెలంగాణకు వ్యతిరేకమ‌ని చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నాడు. v6 ఛానెల్ అంతు చూద్దామ‌ని వ‌చ్చిన‌ట్లు చెప్పాడు. తెలంగాణను వదిలి బిత్తిరి స‌త్తి ఎంత దూరం వెళ‌తాడు? అని ప్ర‌శ్నించాడు. తెలంగాణ గురించి ఆ ఛానెల్ చెడుగా ప్ర‌చారం చేస్తోంద‌ని, బిత్తిరి స‌త్తిని కొట్టేసి ఆ ఛానెల్‌ని మూసేద్దామ‌ని వ‌చ్చిన‌ట్లు మాట్లాడాడు. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.