కేసీఆర్ కు మద్దతు తెలిపిన స్టాలిన్..

SMTV Desk 2017-11-27 15:23:19  reservation issue, kcr darna at delhi janthar mantar, dmk working president stalin.

హైదరాబాద్, నవంబర్ 27 : తెలంగాణలో రిజర్వేషన్లను అమలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా చేయనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు తాను సంఘీభావం తెలుపుతున్నానంటూ స్టాలిన్ ప్రకటించడంతో ఈరోజు కేసీఆర్ స్టాలిన్ కు ఫోన్ చేశారు. తనకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్ల సాధనలో కలసికట్టుగా ముందుకు సాగాలని ఇరు నేతలు నిర్ణయించారు.