ముఖ్యమంత్రితో, సంపూర్ణేష్ బాబు భేటీ...

SMTV Desk 2017-11-24 14:43:14  kcr, sampoornesh babu, hyderabad

హైదరాబాద్, నవంబర్ 24: ఈ మధ్య కాలంలో పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి పలు అంశాలపై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు, ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సినిమాలకు సంబంధించి తన భవిష్యత్ కార్యాచరణను ఈ సందర్భంగా సీఎంకు సంపూ వివరించాడు.