నిలోఫర్‌లో 13మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు... అవుట్...

SMTV Desk 2017-11-22 15:15:49  niloufer hospitals, doctor murali krishna, outsourcing.

హైదరాబాద్, నవంబర్ 22: నిలోఫర్‌ ఆసుపత్రిలో 13 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మురళికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యశాలలోని విద్యాసాగర్‌ హాల్‌లో సెప్టెంబరు 26న మద్యం తాగి వీరంగం సృష్టించారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రజిత్‌ (డీపీఓ), సాయి సంపత్‌ (ల్యాబ్‌ అటెండెంట్‌), నరేందర్‌ (ఎలక్ట్రీషియన్‌), శ్రీనివాస్‌ (డ్రైవర్‌) లతో పాటు కుమారస్వామి (డ్రైవర్‌), సాయికిరణ్‌ (ఎలక్ట్రీషియన్‌), బాబులాల్‌ (ఎలక్ట్రీషియన్‌), రాము (డ్రైవర్‌), విష్ణు (వార్డుబాయ్‌), రవికాంత్‌ (ఎలక్ట్రీషియన్‌), హనుమంతు (టెలిఫోన్‌ ఆపరేటర్‌), భాస్కర్‌ (ల్యాబ్‌ టెక్నీషియన్‌), జగదీష్‌ (డాటా ఎంట్రీ ఆపరేటర్‌)లు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నట్లుగా ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో స్పందించిన సూపరింటెండెంట్‌ విచారణ కమిటీ వేశారు. మద్యం తాగినట్లు ఫొటోలతో సహా ఆధారాలు లభ్యమవడంతో వీరిని విధుల్లోంచి తొలగిస్తూ..వారి స్థానంలో వేరేవారిని నియమించాలని పొరుగు సేవల సంస్థను సూచించారు.