మహిళా నిరుద్యోగులు జర భద్రం!

SMTV Desk 2017-11-21 15:05:03  hr narendar singh, shee team, hyderabad updates

హైదరాబాద్, నవంబర్ 21: ఓ ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ నిర్వాకం సభ్య సమాజం సిగ్గు పడేలా చేసింది. ఉద్యోగం కోసమని ఓ నిరుద్యోగురాలు ఇంటర్వ్యూ కి వెళ్తే నీ హాట్ ఫొటోలు పంపు ఉద్యోగం ఇస్తానంటూ ఓ ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ అడిగాడు. ఫ్రెషర్ అయి నందు వలన నీకు ఎక్కడా ఉద్యోగం రాదు అ౦టూ ఆ ప్రభుద్దుడు సందేశం పంపాడు. విసిగి పోయిన ఆ యువతి షీ టీం కు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన షీ టీం ఏసీపీ కవిత హెచ్ఆర్ నరేందర్ సింగ్ ను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. కాగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.