కేసీఆర్‌ కిట్‌కు రెండు కమిటీలు

SMTV Desk 2017-11-21 13:02:48  KCR Kit, Two committees, Hyderabad

హైదరాబాద్‌, నవంబరు 21 : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ పథకాలలో ఒక్కటైనా కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని కూడా అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్‌ కిట్‌లోని వస్తువుల నాణ్యతపై 2 కమిటీలు వేసింది. ఒకటి ఉన్నత స్థాయి కమిటీ కాగా, రెండోది టెక్నికల్‌ కమిటీ. వస్తువుల నాణ్యత, తిరస్కరణతో పాటు రికవరీ అంశాలకు సంబంధించి సాంకేతిక కమిటీ సిఫారసులపై, ఉన్నత స్థాయికమిటీ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.