అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలకు సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు

SMTV Desk 2017-11-20 16:45:17  BCC welfare minister Acheyanaidu, ap assembly

అమరావతి, నవంబర్ 20 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో భాగంగా ప్రశ్నోత్తరాలు అడిగిన ప్రశ్నకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. సభలో లబ్ధిదారులకు ఉపకరణాలను అందించే విధంగా చర్యలు చేపడతామని ప్రశ్నోత్తరాల సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ...వెనుకబడిన వర్గాల్లో కులవృత్తుల కోసం నూతన ఆదరణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ఫెడరేషన్ల ద్వారా రూ.350కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. నూతన ఆదరణ పథకం కోసం మరో రూ.250కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన చేతివృత్తుల వారికి అధునాతన, మెరుగైన చేతి పనిముట్లు సమకూర్చడమే లక్ష్యంగా కొత్త ఆదరణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన సభలో పేర్కొన్నారు.