కొత్త మార్గాన్ని ఎంచుకున్న పసిడి స్మగ్లర్లు

SMTV Desk 2017-11-19 18:28:09  gold Smugglers now root, Customs officers

న్యూఢిల్లీ, నవంబర్ 19 : పసిడి అక్రమార్కుల విషయంలో స్మగ్లర్లు కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. గతంలో గల్ఫ్‌ దేశాల నుంచి బంగారాన్ని పెద్దఎత్తున తరలించే వారు, ఇప్పుడు యూరోపియన్‌ దేశాల నుంచి దేశంలోకి తీసుకొస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటనలను వెలుగు చూశారు. దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా అక్రమంగా ఈ లోహాన్ని వివిధ రూపాల్లో స్మగ్లర్లు తరలిస్తుంటారు. విమానాశ్రయాల్లో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే వారిపై కస్టమ్స్‌ సిబ్బంది ఓ కన్నేసి ఉంచడంతో, అక్రమార్కులు తమ పంథాను మార్చుకున్నారు. కస్టమ్స్‌ నుంచి తప్పించుకునేందుకు తొలుత యూరోపియన్‌ దేశాలకు వెళ్లి అక్కడి నుంచి మన దేశానికి వస్తున్నారు. సాధారణంగా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న అనుమానాలు తక్కువ వ్యక్తమవుతుంటాయి. దీంతో అక్రమార్కులు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. ‘సాధారణంగా యూరోపియన్‌ దేశాల నుంచి ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్‌ చేయడం అరుదు. అందుకే స్మగ్లర్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నరని, కస్టమ్స్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవల ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి వస్తున్న వృద్ధ జంట వద్ద సుమారు రూ.25.54 లక్షల విలువైన 995 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు లండన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద సుమారు రూ.30లక్షలు విలువైన బంగారాన్ని, పారిస్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి రూ.66లక్షలు విలువైన 2 కేజీల పసిడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.