అగ్ర దేశాలకు పోటీగా భారత్...

SMTV Desk 2017-11-19 16:32:04  gdp, imf , india, ppp based, india 126 th place

న్యూఢిల్లీ, నవంబర్ 19 : అమెరికా, చైనా, రష్యా వంటి అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గల దేశాలకు దీటుగా భారత్ చేరువవుతుంది. సరళతర వ్యాపార నిర్వహణలో 30 స్థానాలు ఎగబాకి, 100 స్థానంలో నిలిచింది. ఇటీవల అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ప్రకటించిన రేటింగ్స్ లో బీఏఏ 2 ర్యాంక్‌ ను భారత్ కు ఆపాదించింది. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌), కొనుగోలు శక్తి ప్రాధాన్యం(పీపీపీ) ఆధారంగా జీడీపీని గణించింది. ఇందులో టాప్ 200 దేశాల్లో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత తలసరి జీడీపీ 6,690 డాలర్లు ఉండగా, తాజాగా 7,170 డాలర్లకు చేరడం ద్వారా భారత ర్యాంకు మెరుగుపడింది. ఈ జాబితాలో అత్యంత ధనిక దేశంగా ఖతార్‌ నిలవగా, రెండో స్థానంలో మకావు, మూడో స్థానంలో లక్సెమ్‌బర్గ్‌ నిలిచాయి. ఐఎంఎఫ్‌ విడుదల చేసిన తలసరి జీడీపీ గణాంకాల ప్రకారం సింగపూర్‌(4), బ్రూనే(5), ఐర్లాండ్‌(6), నార్వే(7), కువైట్‌(8), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(9), స్విట్జర్లాండ్‌(10)లు టాప్‌ టెన్‌లో నిలిచాయి. అయితే అగ్రరాజ్యం అమెరికా తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకోవడం గమనార్హం.