కెసిఆర్ కుటుంబమే లాభపడింది: ఉత్తమ్

SMTV Desk 2017-11-18 17:06:43  utham kumar reddy about kcr family, kcr, utham

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ టిడిపి నేతలు అటు టిఆర్ఎస్ వైపు, ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. తాజాగా మెదక్ జిల్లాకు చెందిన కొందరు టిడిపి నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుటుంబం మాత్రమే లాభపడిందని విమర్శించారు. మెదక్‌ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళా యాదవరెడ్డి బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం నిలువునా వంచించిందని ఆరోపించారు. తెలంగాణ వస్తే దళితులకు భూమి, పేదలకు ఇళ్లు, విద్య, వైద్యం వస్తుందని ఆశపడితే చివరికి ఏమీ దక్కడం లేదని ఆయన అన్నారు.