మెట్రో స్టేషన్ ల వద్ద అనుచితంగా ప్రవర్తిస్తే జైలుకే..

SMTV Desk 2017-11-14 19:24:53  Section-74 under the Metrorail Act, Metro railway station, Ten years rigorous imprisonment.

హైదరాబాద్, నవంబర్ 14 : మెట్రో రైలు తొలిద‌శ‌ను ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించే అవ‌కాశం ఉంది. ఈ నేపథ్యంలో మెట్రోరైలు స్టేష‌న్ల వ‌ద్ద ఎవరైన అనుచితంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, జైలుకి వెళ్లాల్సిందేనని హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థ తెలిపింది. ఈ మేరకు నియమ నిబంధనలను విడుదల చేసింది. ఎవరైనా విధ్వంసక చర్యలకు పాల్ప‌డితే మెట్రోరైల్ చ‌ట్టం ప్ర‌కారం సెక్షన్‌-74 కింద గరిష్టంగా పదేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తారని, చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు ఎవరైనా పాల్ప‌డితే ఎవ్వరూ త‌ప్పించుకోలేరని మెట్రో రైల్వే సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.