మహిళా హోంగార్డ్ తో ఏఎస్ఐ మసాజ్...

SMTV Desk 2017-11-14 11:41:26  lady homeguard massage, gadwal, telangana,

గద్వాల, నవంబర్ 14: శరీర విశ్రాంతి కోసం చేయించుకునే మసాజ్, తన సుఖంగా మార్చుకున్నాడు ఓ పోలీసు. అంతేకాదు తన క్రింది మహిళ ఉద్యోగితో మర్దనా చేయించుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. గద్వాలలోని సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వెంటనే ఎస్పీ విజయ్ కుమార్ విచారణ చేపట్టి హసన్ ను సస్పెండ్ చేశారు. ఇలాంటివి మళ్లీ మళ్లీ పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.