కేసీఆర్, చంద్రబాబు చంపేయమన్నారు...

SMTV Desk 2017-11-14 11:23:44  nagar karnool, police harassment, kcr, chandrababu naidu, hyderabad,

నాగర్ కర్నూల్, నవంబర్ 14: కెసిఆర్, చంద్రబాబు చంపేయమన్నారంటు సోషల్ మీడియాలో ఓ వీడియో హాల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూలు జిల్లాలో రాజు అనే యువకుడు ఏడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. కొంత కాలంగా వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో యువతి పుట్టింటికి చేరింది. ఆమెతో చర్చల నేపథ్యంలో వారింటికి వెళ్లాడు రాజు. దీనిని అదనుగా చేసుకున్న ఆమె బంధువులు రాజుపై దాడి చేసి, పోలీసు కంప్లైంట్ చేశారు. అక్కడి ఎస్సై సైదాబాబు, ఇతర పోలీసులు రాజును చావా బాదారు. దీంతో ఆవేదనకు గురైన రాజు తన సేల్ఫీ వీడియోలో..." నేను చేసిన తప్పేంటి..? అని అడగగా కేసీఆర్, చంద్రబాబు చంపేయమన్నారని, అందుకే కొడుతున్నామని ఎస్సై సమాధానం ఇచ్చాడు. బట్టలిప్పించి గొడ్డును బాదినట్టు బాదారు. ఆ దెబ్బలకు నడవలేకపోతున్నాను, తొడలు కమిలిపోయాయి. ఇదేం న్యాయ౦..? పోలీసులు ఇలాగేనా వ్యవహరించేది? మహిళలు కూడా ఆలోచించాలి. వారిది కూడా తప్పు ఉంటుంది. తప్పంతా మగాళ్ల మీదే తోసేయడం సరికాదని" కన్నీటి పర్యంతమవుతూ పేర్కొన్నాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా రాజు చికిత్స పొందుతూ మరణించాడు. అంత్యక్రియల సమయంలో అతని ఫోన్ లో ఈ సూసైడ్ వీడియో లభ్యమైంది. దీంతో ఎస్సై సైదాబాబు కఠినంగా శిక్షించాలని రాజు బంధువులు, సన్నిహితులు డిమాండ్ చేస్తున్నారు. .