అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం...

SMTV Desk 2017-11-13 19:45:31  annapurna studio fire accident, banjarahills, hyderabad

హైదరాబాద్, నవంబర్ 13: బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టూడియో లోని సినిమా సెట్టింగ్స్ దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని, ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి వుంది.